'శ్రీనివాస కళ్యాణం'కాన్సెప్ట్ టీజర్ రిలీజ్!
- July 18, 2018
తెలుగు ఇండస్ట్రీలో హీరో నితిన్, దిల్ రాజు కాంబినేషన్ లో వచ్చిన 'దిల్' చిత్రం మంచి విజయం సాధించింది. చాలా కాలం గ్యాప్ తర్వాత దిల్ రాజ్ తో 'శ్రీనివాస్ కళ్యానం' చిత్రంలో నటిస్తున్నాడు నితిన్. శతమానం భవతి సతీష్ వేగేశ్న ఈ చిత్రానికి దర్శకుడు. దిల్ చిత్రం విడుదలైన 15 ఏళ్ల తరువాత నితిన్, దిల్ రాజు కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రానికి దిల్ రాజే నిర్మాత. ఆగష్టు 9 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనితో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలపై దృష్టి పెట్టింది.
ఈ ఉదయం 9 గంటలకు శ్రీనివాస కళ్యాణం కాన్సెప్ట్ టీజర్ విడుదల చేశారు. అదే సమయంలో ఆడియో వేడుక తేదీని కూడా ప్రకటించనుండడం విశేషం.
వివాహ బంధం గొప్పదనాన్ని తెలియజేసే విధంగా ఈ చిత్రం ఉండనుంది. 'మనం పుట్టినపుడు చాలామంది సంతోషిస్తారు..అది మనకు తెలియదు..మనం దూరమైనపుడు మనవాళ్లందరూ బాధపడతారు..అదీ మనకు తెలియదు'. మనకు తెలిసి మనం సంతోషంగా ఉండి..మనవాళ్లందరూ సంతోషంగా ఉండేది ఒక్క పెళ్లిలో మాత్రమే..అలాంటి పెళ్లి గొప్పతనం గురించి చెప్పే ఓ చిన్ని ప్రయత్నమే మా ఈ 'శ్రీనివాస కళ్యానం' అంటూ జయసుధ వాయిస్ ఓవర్ తో ముగుస్తుంది.
నితిన్, రాశి ఖన్నా జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో భారీ తారాగణమే ఉంది. ప్రకాష్ రాజ్, నరేష్, జయసుధ వంటి సీనియర్ నటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. నందిత శ్వేతా కీలక పాత్రలో నటిస్తోంది. ఇటీవల విడుదలైన ఫస్ట్ సాంగ్ కు అద్భుతమైన స్పందన వచ్చింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







