దుబాయ్ గల్ఫ్ తెలంగాణ సంఘం అధ్వర్యంలో ఘనంగా జరిగిన క్రిస్మస్ మరియు న్యూఇయర్ సంబరాలు
- December 13, 2015
గల్ఫ్ తెలంగాణ సంఘం అధ్వర్యంలో దుబాయ్ లో క్రిస్మస్ మరియు న్యూఇయర్ సంబరాలు 11 డిసెంబర్ శుక్రవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు.
క్రీస్తు జననం, బైబుల్ సందేశం గురించి దుబాయి లోస్థిరపడిన తెలంగాణకు చెందిన క్రైస్తవ మత పెద్దలు క్రీస్తు కుమార్ విశదీకరించారు.తెలంగాణ లోని వివిధ జిల్లాలకు చెందిన క్రైస్తవ కుటుంబాలు వివిధ రకాలైన కరోల్ పాటలు పాడుతూ సందేశాన్ని పంచారు.
క్రిస్మస్ కేక్ కటింగ్ తో కార్యక్రమాలను ఆరంభించిన అధ్యక్షులు జువ్వాడి శ్రీనివాస్ రావు మరియు ఉపాధ్యక్షులు రాజ శ్రీనివాస్ రావు, సంఘం చేస్తున్న పలు కార్యాక్రమాలను వివరించారు. తెలంగాణ ప్రభుత్వ సహకారం తో మున్ముందు మన పండుగలను పెద్ద ఎత్తున చేసుకొనే ఏర్పాట్లు చేసుకుందామని,తెలంగాణ అంటే గంగా జమునా తెహజీబ్ అనే నానుడిని మనం ఏ దేశంలో ఉన్నా చాటిద్దామని అభిప్రాయపడ్డారు. ముఖ్య అథిది గా వచ్చిన కవిగాయకుడు తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక అవార్డ్గ్రహీత మట్ల తిరుపతి ని సభకు పరిచయం చేసారు.తిరుపతి తనదైన శైలిలో సామాజిక స్ప్రుహను నింపేవివిధ పాటలను పాడుతూ అహుతులను ఉర్రూతలూగించినారు. కార్యక్రమానికి తెలంగాణ కుచెందిన వ్యాపారవేత్తలు గడ్డం గంగాధర్, రుద్రశంకర్,అంబటి రఘు,బాబూ రావు లు సహకారం అందించినారు.
సాంటా క్లాజ్ తాత కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
చిన్న పిల్లల కోలాహలం మధ్య సాంటా తాత అందరికి బహుమతులు ఇచ్చినారు. చిరంజీవి కవీష్ తెలంగాణా గీతాలు పాడి శ్రోతలను అలరించాడు.
కార్యక్రమానికి 300 పైగా కుటుంబాలు రాగా, ప్రత్యేకంగా తయారు చేయించిన మన తెలంగాణ విందు భోజనం వడ్డించినారు.
క్రిస్మస్ కార్యక్రమాల నిర్వహణ మొత్తం శ్రీమతి.ఉపాసనా రాబర్ట్ గారి ఆధ్వర్యం లో గల్ఫ్ తెలంగాణమహిళా కార్యవర్గం పావని, జయా, హేమ, మెర్సి,నాగమణి, శ్రీదేవి మరియు రోజా గార్లు ఒక భాద్యతగా నిర్వహించడం చెప్పుకోదగిన విషయం.
సంఘ సభ్యులు శల్మా ప్రసాద్, సామ్యుల్ దామెర,సదానంద్ బద్దూర్, మెట్ట రమేష్ చంద్ర, కటుకం రవి,విజయ్ యాదవ్, శంకర్ దేవరకొండ, సలాహుద్దిఇతర కార్యవర్గం ఏర్పాట్లను పర్యవేక్షించారు.
గల్ఫ్ తెలంగాణ సంఘం వారికి మాగల్ఫ్.కామ్ తరుపున ప్రత్యేక అభినందనలు.








తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







