'ఫేస్ బుక్ డిజ్ లైక్'
- December 14, 2015
జర్మనీలో ఫేస్ బుక్ కార్యాలయంపై గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. హాంబర్గ్ లోని ఫేస్ బుక్ కార్యాలయంపై దాదాపు 20 మంది దాడి చేసి అద్దాలు పగలగొట్టి, పెయింట్ చల్లారు. కార్యాలయం ప్రవేశద్వారం వద్ద 'ఫేస్ బుక్ డిజ్ లైక్' అని రాసినట్టు జర్మన్ మీడియా వెల్లడించింది. దాడి చేసిన దుండగులు నల్లటి దుస్తులు, ముసుగులు ధరించినట్టు హాంబర్గ్ పోలీసులు చెప్పారు. ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తున్న జాతి వివక్ష వ్యాఖ్యల వల్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయని జర్మనీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన జాతిని రెచ్చగొట్టే ప్రసంగాలను తొలగించడంలో విఫలమైనందుకు ఫేస్ బుక్ యూరప్ విభాగం చీఫ్ జర్మనీలో విచారణ ఎదుర్కొంటున్నారు. కాగా జర్మనీ చట్టాలను తాము ఉల్లంఘించలేదని ఫేస్ బుక్ ప్రతినిధి చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ చేస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







