రాబోతున్న పవన్-లారెన్స్ కాంబినేషన్

- May 09, 2015 , by Maagulf
రాబోతున్న పవన్-లారెన్స్ కాంబినేషన్

హారర్ సీక్వెల్ 'గంగ'తో లారెన్స్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. కొరియోగ్రాఫర్‌గానే కాకుండా దర్శకుడిగా కూడా తన సత్తా చాటుకుంటున్నాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ లాంటి స్టార్లే స్వయంగా అభినందనలు తెలపడం లారెన్స్‌కు మరింత ఆనందాన్ని ఇచ్చింది. దీంతో ఈ తమిళ తంబికి డిమాండ్ పెరిగిందట. ప్రస్తుతం ఈ మాస్ డైరెక్టర్ తో సినిమా నిర్మించేందుకు తెలుగు, తమిళ భాషల నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారట. ఇన్నాళ్లు సొంత కథతోనే సినిమాలు చేసిన లారెన్స్... తన తదుపరి చిత్రాన్ని ఓ రీమేక్ ఆధారంగా తెరకెక్కించబోతున్నాడు. తెలుగు 'పటాస్ ' మూవీని రీమేక్ చేసే పనిలో లారెన్స్ నిమగ్నమై ఉన్నాడట. ఇదిలా ఉంటే....లారెన్స్.. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కోసం ఓ కథను సిద్థం చేస్తున్నట్లు తాజా ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. రాజకీయ నేపథ్యం లేకుండా, మంచి సందేశంతో కూడిన కథ ఒకటి పవన్ కళ్యాణ్ కోసం సిద్ధం చేస్తున్నట్లు, స్ర్కిఫ్ట్ పూర్తి చేసిన వెంటనే పవన్ కళ్యాణ్‌కి వినిపించనున్నట్లు లారెన్స్ చెప్పుకొచ్చాడు. అలాగే రజనీకాంత్ కూడా మన కాంబినేషన్‌లో ఓ సినిమా చేద్దామని అన్నారని రాఘవ లారెన్స్ తెలిపాడు. సినిమాల్లో విభిన్నమైన అంశాన్నితెరకెక్కించాలనుకుంటానని.. కానీ నాకు హారర్ సినిమాలు మాత్రమే సక్సెస్‌ను ఇచ్చాయని లారెన్స్ తెలిపాడు.                 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com