సూర్య, త్రివిక్రమ్ కాంబినేషన్..
- December 15, 2015
టాలీవుడ్ లో ఓ అరుదైన కాంబినేషన్ రాబోతుంది..గజినీ తో టాలీవుడ్ మార్కెట్ లో తనదైన ముద్ర వేసుకున్న సూర్య, తన మాటలతో అందర్ని మాయ చేసే త్రివిక్రమ్ వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతుంది.చాల రోజులుగా వీరి కలయిక గురించి ఫిలిం నగర్ లో వినపడుతున్న ఇంతవరకు అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.కానీ ఇన్ని రోజుల తర్వాత వీరి సినిమా గురించి ప్రకటన బయటకు వచ్చింది. ప్రస్తుతం 'అ..ఆ ' చిత్రం చేస్తున్న త్రివిక్రమ్ ఇది పూర్తి కాగానే సూర్య తో సినిమా స్టార్ట్ చేయబోతున్నాడట..సూర్య కూడా 'సింగం 3' చేస్తుండడం ఇది కూడా పూర్తి కావడానికి మరో అయిదు నెలలు అయిన పడుతుంది..సో ..జూలై నెలలో వీరి సినిమా సెట్స్పైకి వెళ్ళేలా ప్లాన్ చేస్తున్నారు. చాల రోజులుగా త్రివిక్రమ్ పవన్ , మహేష్ , ఎన్టీఆర్ లతో సినిమా చేస్తాడని వినిపించిన , ఆ వార్తలు కొంత కాలం తెరపడనుంది.. ఇక ఈ సినిమా నిర్మాత ఎవరు..? కాస్ట్ క్రూ ఏంటి అనేది తెలియాలి అంటే మరి కొన్ని నెలలు ఆగాల్సిందే..
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







