కోరిక తీర్చడం ఎంతో ఆనందం...
- December 15, 2015
అజిత్‌సింగ్‌నగర్ క్యాన్సర్ బాధితురాలైన తన అభిమాని కోరిక తీర్చేందుకు సినీనటుడు అల్లు అర్జున్ మంగళవారం విజయవాడలోని అజిత్‌సింగ్‌నగర్ విచ్చేసారు. దీంతో ఆ ప్రాంతమంతా సందడి వాతావరణం నెలకొంది. తమ అభిమాన హీరో వస్తున్నాడని తెలిసి యువకులందరూ అల్లు అర్జున్‌ను చూసేందుకు తరలివచ్చారు. అల్లు అర్జున్‌కు అభిమానులు పూలతో ఘన స్వాగతం పలికారు. మస్తాన్‌బీ అనారోగ్యానికి సంబంధించిన వివరాలు తెలుసుకొని, భయపడవద్దని భరోసా కల్పించారు. కొద్ది సేపు ఆమె కుటుంబంతో గడిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... క్యాన్సర్‌తో బాధపడుతున్న షేక్ మస్తాన్‌బీ గురించి ఓ టీవీ ఛానెల్‌లో వచ్చిన కథనాన్ని చూసి పరామర్శించేందుకు వచ్చినట్లు తెలిపారు. తమ కుటుంబాన్ని ఇంతగా అభిమానించే అభిమానుల కోరిక తీర్చడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







