త్వరలో 'ధనాధన్' చిత్రం
- December 15, 2015
వైభవ్, రమ్యా నంబీసన్ జంటగా థర్డ్ ఐ పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియోస్ వారి బ్లాక్ బస్టర్ మూవీ మేకర్స్ నిర్మించిన 'ధనాధన్' చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్దంగా ఉంది. చిత్ర నిర్మాతలు డా|| శివ వై ప్రసాద్, శ్రీనివాస్ అనంతనేని మాట్లాడుతూ ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగికి తన ఉద్యోగం పోవడం వల్ల తన జీవితంలో జరిగిన పరిణామాల ఆధారంగా ఈ చిత్రం నిర్మించడం జరిగింది.అనుకున్నదానికంటే సినిమా చాలా బాగా వచ్చింది. తమిళ దర్శకుడు శంకర్ శిష్యుడు శ్రీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. యస్ యస్ తమన్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు హై లైట్ గా నిలుస్తుంది.త్వరలోనే ఆడియోను సోని మ్యూజిక్ ద్వారా విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. కోటా శ్రీనివాసరావు,షియాజీ షిండే ముఖ్య ప్రతినాయకులుగా నటిస్తున్న ఈ కామెడీ థ్రిల్లర్ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. వైభవ్, రమ్యా నంబీసన్,కోటా శ్రీనివాసరావు,షియాజీ షిండే, చార్లీ, ప్రవీణ్ మొదలగు వారు నటించిన ఈ చిత్రానికి మ్యూజిక్: ఎస్. ఎస్. తమన్, పాటలు: డా||రాణిపులోమజాదేవి, మాటలు: శివ పార్వతి, కోరియోగ్రఫీ: అన్విత, శోభి, సతీష్, డి.ఓ.పి: ఎ. ఎం.ఎడ్విన్ సాకే, నిర్మాతలు: డా|| శివ వై ప్రసాద్, శ్రీనివాస్ అనంతనేని, కథ, దర్శకత్వం: శ్రీ
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







