కేరళకు వివిధ రాష్ట్రాలు ఎంతెంత విరాళాలు ఇచ్చాయంటే..

- August 18, 2018 , by Maagulf
కేరళకు వివిధ రాష్ట్రాలు ఎంతెంత విరాళాలు ఇచ్చాయంటే..

కేరళలో విపత్తును చూసి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు చలించిపోతున్నాయి. ఆదుకునేందుకు మానవతాసాయంతో ముందుకు వస్తున్నాయి. వరద బాధితుల కోసం ఆహారం, మంచి నీరు సరఫరా చేసేందుకు ప్రత్యేక రైలు మహారాష్ట్రలోని పుణె నుంచి బయల్దేరింది. కేరళలోని చిన్నారుల కోసం.. వంద టన్నుల ఆహార పొట్లాలను పంపిస్తున్నట్లు కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనక గాంధీ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వంద మెట్రిక్‌ టన్నుల బాలామృతాన్ని పంపిస్తోంది. బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ 10కోట్ల సహాయం ప్రకటించారు. హర్యానా సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టార్‌ 10కోట్లు.. తెలంగాణ సర్కారు 25కోట్లు, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 10కోట్ల విరాళం ప్రకటించింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ 10కోట్ల సాయం అందజేశారు. ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఒక నెల జీతాన్ని కేరళ సహాయ నిధికి ఇవ్వనున్నారు. అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ కేరళ బాధితుల కోసం కోటి విరాళంగా ప్రకటించారు. స్టేట్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా 2 కోట్ల సాయం ప్రకటించింది.

గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ 10కోట్ల ఆర్థికసాయం అందజేయనున్నట్లు తెలిపారు. ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ 5 కోట్ల సాయం ప్రకటించారు. అలాగే సహాయక చర్యలు అందించేందుకు 245 మంది అగ్నిమాపక సిబ్బందిని పంపిస్తున్నట్లు తెలిపారు. ఈ బృందం 75బోట్లను కూడా తీసుకెళ్తోంది. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ 20 కోట్ల సాయం ప్రకటించారు. ఇక.. కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక నెల వేతనాన్ని విరాళంగా ఇస్తారని ఏఐసీసీ తెలిపింది. కేరళ సీఎం విజయన్‌తో ఫోన్‌లో మాట్లాడిన ఏపీ సీఎం చంద్రబాబు… అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com