‘అదుగో’సినిమా వస్తుంది..
- August 19, 2018
నటుడు, దర్శకుడు రవిబాబు మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. జంతువుల నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి కానీ మొదటిసారి ఓ పందిపిల్ల ప్రధాన పాత్రలో ‘అదుగో’ సినిమాను రూపొందించారు రవిబాబు. ఇదివరకే ఈ సినిమాకు ప్రత్యేకమైన ప్రచారానికి తెరతీశాడు రవిబాబు. ఇక షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం చాలాసార్లు రిలీజ్ డేట్ వాయిదా పడుతూ వస్తోంది. అయితే తాజాగా ‘అదుగో’ రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్‌లో రిలీజ్ చేసేందుకు నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో అభిషేక్, నాభ లు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను రవిబాబు స్వయంగా తన సొంత నిర్మాణ సంస్థ ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్‌పై నిర్మించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







