కేరళ భారీ వరదలపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్ర విచారం
- August 19, 2018
తిరువనంతపురం: కేరళ భారీ వరదలపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందించారు. ఈ విపత్తుపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వరదల దాటికి మృతి చెందిన వారి పట్ల ఆయన సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
'కేరళ ప్రకృతి అందాలను గురించి భారత దేశానికి వచ్చినప్పుడు విన్నాను. అంతటి గొప్ప ప్రదేశం ప్రస్తుతం వరదల గుప్పిట్లో చిక్కుకుంది. ఎంతో మంది మృతి చెందారు. వారందరికీ నా సంతాపం. వారందరి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, గాయాలపాలైన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాల'ని ట్వీట్ చేశారు.
భారీ వర్షాలు, వరదల కారణంగా కేరళలో తీవ్ర నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. పెద్ద ఎత్తున ప్రజలు ఆహారం దొరకక, ఇళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. లక్షలాది మంది పునరావాస కేంద్రాల్లో ఉంటున్నారు. గత వంద సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా వరదలు రాష్ట్రాన్ని ముంచెత్తాయి.
ఈ విపత్తుతో కేరళ పరిస్థితి అత్యంత దారుణంగా మారిపోయింది. చాలా చోట్ల ప్రజలు వరదల్లో చిక్కుకుపోయి ఆహారం, నీరు లేక సహాయం కోసం దీనంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే దాదాపు 350 మందికి పైగా మృతి చెందారు.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







