ఆసియ దెశెస్తులైన 6 దొంగలను అదుపులోనికి తీసుకొన్న ఒమాన్ పోలీసులు

- December 17, 2015 , by Maagulf
ఆసియ దెశెస్తులైన  6 దొంగలను అదుపులోనికి తీసుకొన్న ఒమాన్ పోలీసులు

 బార్బర్ షాప్ లోనికి వచ్చిన ఆ దొంగలు ముందుగా మంగలితో బేరం కుడుర్చుకొంటారు.  క్రాఫ్ పూర్తయిన  తర్వాత వారు 50 రియాల్ పెద్ద నోట్ ఇస్తారు. దీంతో, ఆ బార్బెర్ తన పనికి ఒప్పుకున్నా డబ్బులు మినహాయంచుకొని చిల్లర నోటేలను తిరిగి వారికి ఇస్తాడు, అంతే,  ఇక వింత గొడవ   మొదలవుతుంది. కేవలం క్షురకర్మకు  50 రియాల్ మావద్ద  తీసుకొంటావా ? విదీశీయులంటే, నీకుఅంత  చులకనా ?  అని మంగలితో వాగ్యువాదానికి దిగుతారు. మా డబ్బు మాకు తిరిగి ఇచ్చేయమని నానా హంగామా  చేస్తారు. దీంతో  విస్తుపోయేన బార్బెర్ ....అదేమిటి ? నేను మీకు తిరిగి.. చిల్లరతో సహా ఇచ్చానుగా అని నిజాయతీగా చెబుతాడు. లేదు... లేదు.... నీవు మాకివ్వనే ఇవ్వలేదని  ఆందరూకల్సి  తడుముకోకుండా అబద్దం చెబుతారు. దీంతో తన షాప్ లో ఈ తరహ అల్లరి ఎందుకని.. మిగిలిన బేరాలు పోతున్నయనే కంగారులో ఆ  అమాయక బార్బెర్ తన  గల్లా పెట్టి నుంచి  వారికి 50  రియాల్నోటును బాధ పడ్తూ,  ఆ  ఘరానా దొంగలకు సమర్పించుకొంటాడు. దీంతో మంగలికి  చేతి కష్టం...దక్కగా పోగా జేబుకు నష్టం...ఏక కాలంలో జరగడంతో  తేరుకొని,  లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తాడు  వరుస దోపిడీలతో...ఒమాన్ లో సంచలనం కల్గించిన  ఆ  ఆరుగురు ఆసియ  దేశాలకు చెందిన దొంగల మోసాలకు ఎట్టకేలకు కళ్ళెం వేశారు ఒమాన్ పోలీసులు.వారి విచారణ,  పరిశోధనలో ఈ దొంగల గమ్మత్తు చోరీలు పలు మంగలి దుకాణాలనే  ఎంచుకోవడం గమనార్హం. వీరినిఅదుపులోనికి  తీసుకొని, తమదైన శైలి లో పోలీసులు విచారిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com