అమ్మ
- May 10, 2015కనులు తెరిచిన క్షణం
కనపడే రూపం అమ్మ
తన ఆత్మ శరీరం పంచి
మనకు జన్మనిచ్చిన దివ్యరూపం అమ్మ
తన రక్తాన్ని పాలుగా మార్చి
మన ప్రాణం నిలుపుతుంది అమ్మ
మన కాలిలో ముళ్ళు విరిగినా
విలవిల లాడిపోయేది అమ్మ
మన మౌనం సైతం
అర్ధం చేసుకోగలదు అమ్మ
మన ప్రాణానికి తన ప్రాణం అడ్డు వేయడానికి
ఏ మాత్రం వెనుకాడదు అమ్మ
తనవన్నీ త్యాగం చేస్తూ
మన ఎదుగుదల కోరుకుంటుంది అమ్మ
మన పెదవిపై చిరునవ్వు
తన గెలుపుగా భావిస్తుంది అమ్మ
చివరిక్షణం వరకు
అనుక్షణం నీకై బ్రతుకుతుంది అమ్మ
చివరిశ్వాస నిను చూస్తూ
నీ చేతుల్లో ఒదలాలని తపించిపోతుంది అమ్మ
ప్రేమ అనే పదానికి అర్ధం అమ్మ
నీ ప్రేమ అమూల్యం అమ్మ
నీ ఋణం తీర్చుకోలేనిది అమ్మ
---నిక్కి
తాజా వార్తలు
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు







