సిల్వర్ జూబ్లీ చేసుకున్న'జగదేక వీరుడు- అతిలోక సుందరి'
- May 10, 2015
సినీ నిర్మాణ ప్రక్రియకి నిలువెత్తు గ్లామరు, గ్రామరుని ఆపాదించిన అపురూప చలన చిత్ర కావ్యం 'జగదేక వీరుడు-అతిలోక సుందరి'. ఊహకే అందరి బడ్జెట్టుతో, అనూహ్యమైన కథతో రంగులతెరని రంజింపజేసిన ఓ ప్రభంజనం.ఓ సంచలన చిత్రం ...1990, మే 9న విడుదలైన 'జగదేక వీరుడు- అతిలోక సుందరి'.ఈ చిత్రం విడుదలైన 25 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ చిత్ర హీరో చిరంజీవి, దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత అశ్వినీదత్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు.25 ఏళ్ల కిందట సినిమా విడుదలైన తర్వాత చోటు చేసుకున్నపరిస్థితులను గుర్తు చేసుకున్నారు.'జగదేక వీరుడు-అతిలోక సుందరి' చిత్రం విడుదలైనపుడు పెను తుఫాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తోంది.ఊళ్లకు ఊళ్లు తుపానులో తూలిపోతున్నాయి.ఆ బీభత్సంలో అశ్వినీదత్ సినిమా విడుదలకు పూనుకుంటే అందరూ ముక్కున వేలేసుకున్నారు.ఆ ప్రకృతి వైపరీతంలో అసలు ప్రదర్శనలు జరుగుతాయా? నిర్మాతకి నూకలు దక్కుతాయా అన్న ప్రశ్నలు పరిశ్రమను ఉక్కిరి బిక్కిరి చేసాయి. అశ్వినీదత్ మాత్రం సినిమాపై నమ్మకంతో ధైర్యంగా విడుదల చేసారు.వర్షాన్ని లెక్కచేయకుండా అప్పట్లో థియేటర్లకు జనం క్యూకట్టారు.తుఫాను వారం రోజులు కొనసాగితే వైజయంతి తుఫాను ఊరూరా రెండువందల రోజులు హోరెత్తింది.సినిమాకు మొదట ప్లాప్ టాక్ వచ్చింది. గతి లేని వీరుడు-మతిలేని సుందరి అంటూ కొందరు విమర్శించారు. అయితే సినిమా అనూహ్యంగా పుంజుకుంది. కలెక్షన్ల వర్షం కురిపించింది. జగదేక వీరుడు అతిలోక సుందరి సెలబ్రేషన్స్ లో చిరంజీవి, రాఘవేంద్రరావు, అశ్వినీదత్ "రిలీజైన రోజు..ఆంధ్రాలో సైక్లోన్.అంతా మా సినిమా సూపర్ ఫ్లాప్ అన్నారు.అయితే కొద్దిరోజులు గడిచింది.సినిమా సునామీ తరహా కలెక్షన్స్ తో దుమ్ము రేపింది. ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. డిజిటలైజ్ చేసి రీరిలీజ్ చేస్తారని తెలుస్తోంది. ఈ చిత్రం నటీనటులు, సాంకేతిక నిపుణులు ముఖ్యంగా చిత్ర ఛాయాగ్రాహకుడు అజయ్ విన్సెంట్, సంగీత దర్శకుడు ఇళయారాజా అందించిన పాటలు చిత్ర విజయానికి దోహదపడ్డాయి. ఈ చిత్రంలోని ఏడు పాటలూ శ్రోతలను బాగా అలరించాయి. ముఖ్యంగా అబ్బనీ తియ్యనీ దెబ్బ వంటి పాటలు ఇప్పటికీ ఆ పాటలు జనం నోళ్లలో నానుతున్నాయంటే అతిశయోక్తి కాదు. స్టెప్పులతో చిరంజీవి అలరిస్తే దేవకన్యగా శ్రీదేవి, దుష్ట మాంత్రికుడుగా అమ్రిష్ పురి నటన ఈ చిత్రానికే హైలెట్.ఈ చిత్రానికి కురిసిన ప్రశంసల జల్లులో దర్శకుడు రాఘవేంద్రరావు తడిసి ముద్దయ్యారు. ఇక స్వర్గీయ జంధ్యాల రాసిన మాటలు ఈ చిత్ర విజయంలో కీలకపాత్ర పోషించాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







