విజిట్, టూరిస్ట్ వీసా.. ఆరు నెలల పొడిగింపు
- October 20, 2018యూఏఈ: యూఏఈ వీసా సిస్టమ్‌లో కొత్త మార్పులు విజిట్, టూరిస్ట్ వీసాదారులకు మరింత వెసులుబాటు కల్పించనున్నాయి. విజిట్ లేదా 30 రోజుల టూరిస్ట్ వీసా ఉన్నవారికి అదనంగా రెండు సార్లు ఎక్స్‌టెన్షన్ (మొత్తంగా 60 రోజులు) పెంచుకునేందుకు కొత్త మార్పులు వెసులుబాటు కల్పిస్తున్నాయి. 3 నెలల విజిట్ వీసా లేదా 1 నెల టూరిస్ట్ వీసా ఉన్నవారు ఆ గడువు పూర్తయ్యాక దేశం విడిచి వెళ్ళాల్సి వుండేది. తాజా మార్పుల తర్వాత 30 రోజుల గడువు ముగిసిన వీసాదారులు ఆ తర్వాత రెండు సార్లు దాన్ని పొడిగించుకోవచ్చని ఫారిన్ ఎఫైర్స్ అండ్ పోర్ట్స్ - ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్ షిప్ - యాక్టింగ్ జనరల్ డైరెక్టర్ బ్రిగేడియర్ సయీద్ రకాన్ అల్ రషిది చెప్పారు. ఉద్యోగార్థులు ఈ వెసులుబాటుతో మరింత ఎక్కువ కాలంలో యూఏఈలో వుండి తమ ప్రయత్నాలు చేసుకోవడానికి వీలుంటుంది.
తాజా వార్తలు
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు
- ఏపీకి ప్రధాని మోదీ..సభలు, రోడ్ షోల షెడ్యూల్ ఇదే
- అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్
- ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు
- పాలస్తీనా శరణార్థులకు యుఎన్‌ఆర్‌డబ్ల్యుఎ మద్దతు
- తుఫాను ప్రభావిత ప్రాంత నివాసితులకు శుభవార్త..!
- NRIలకు IFSCA పెట్టుబడి అవకాశాలపై సెమినార్
- ఖతార్ సరిహద్దులో భారీగా ఆయుధాలు స్వాధీనం