ఏపీపీఎస్సీ నోటిఫికేషన్
- November 30, 2018
వివిధ ఇంజనీరింగ్ విభాగాల్లో 309 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
అభ్యర్థులు డిసెంబరు 3 నుంచి 24లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు రూ.250లు, పరీక్ష ఫీజు కింద రూ.120 చెల్లించాలి. అభ్యర్థులు ముందుగా తమ వివరాలను వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ (ఓటీపీఆర్) చేసుకుని, తద్వారా వచ్చిన యూజర్ ఐడీ ద్వారా దరఖాస్తు పెట్టుకోవాలి.
దరఖాస్తుల సంఖ్య 25 వేలకు మించినట్లయితే స్క్రీనింగ్ టెస్ట్, అంతకంటే తక్కువ వస్తే నేరుగా ఆన్‌లైన్‌లో మెయిన్స్ నిర్వహిస్తారు. ఈ రెండు పరీక్షలూ ఆబ్జెక్టివ్ టైపులో ఉంటాయి. ఆఫ్‌లైన్‌లో నిర్వహించే స్క్రీనింగ్ టెస్ట్‌లో 150 ప్రశ్నలు, మెయిన్స్‌లో 450 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు ఉంటుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







