శమరిమల ఆలయం మూసివేత..
- December 26, 2018
ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో ఇవాళ అయ్యప్పస్వామి ఆలయాన్ని మూసివేయనున్నారు. గత నెల 15వ తేదీ నుంచి మండల పూజలు ప్రారంభం కాగా... 41వ రోజైన ఇవాళ రాత్రి ఆలయం తలుపులు మూసివేయనున్నారు. ఇక మకరవిళక్కు సందర్భంగా ఈ నెల 30వ తేదీన తిరిగి ఆలయాన్ని తెరుస్తారు పూజారులు... అదే రోజున ఎరుమేళి నుంచి పెద్దపాదం మార్గం, వండిపెరియార్ నుంచి పులిమేడు దారుల్లో భక్తులకు అనుమతిస్తారు. ఇక జనవరి 14వ తేదీన మకరజ్యోతి దర్శనం ఇవ్వనుంది. మరోవైపు సుప్రీంకోర్టు ఆదేశాలతో అన్ని వయస్సుల మహిళలకు అయ్యప్పదర్శనం కలిపించేందుకు కేరళ ప్రభుత్వం ఏర్పాట్లు చేయగా... ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఆలయ ప్రవేశానికి మహిళలు యత్నించడం... కొందరు భక్తులు అడ్డుకోవడం జరుగుతోంది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







