పార్లమెంటు సభ్యుల జీతభత్యాలు పెరగనున్నాయి..
- December 24, 2015
త్వరలో పార్లమెంటు సభ్యుల జీతభత్యాలు పెరగనున్నాయి. ప్రస్తుతం వారు పొందుతున్న జీతభత్యాలకంటే రెట్టింపు మొత్తంలో వారికి అందనున్నాయి. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఇప్పటికే ఆర్థికశాఖకు ప్రతిపాదన చేసినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఎంపీట జీతాలు రెట్టింపును ఖరారు చేసే అవకాశం ఉంది. దీని ప్రకారం ప్రస్తుతం ఎంపీకి రూ.50 వేలు చెల్లిస్తుండగా అది లక్షకు పెరగనుంది. అలాగే కార్యాలయ ఖర్చులు, నియోజకవర్గ అలవెన్సులు రూ.45 వేలు చెల్లిస్తుండగా దానిని 90 వేలు చేయనున్నారు. ఇతర అలవెన్సులో మరో లక్ష అందనున్నాయి. ఇలా ఆర్థికశాఖ ఆమోదం లభిస్తే మొత్తం రూ.2.8లక్షల జీతభత్యాలు ఒక్కో లోక్ సభ, రాజ్యసభ సభ్యుడికి అందనున్నాయి. అయితే, చాలామంది నేతలకు తమ జీతాలను పెంచడం మాత్రం ఇష్టం లేదట. ఐటీ డిపార్ట్ మెంట్ వల్ల చిక్కులు వస్తాయని, అందుకే తమ అలవెన్సులు మాత్రం పెంచితే చాలని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో 2010లో ఒకసారి పార్లమెంటు సభ్యులకు జీతభత్యాలు పెంచారు. తిరిగి పెంచేందుకు ఇదే తగిన సమయం అని భావిస్తున్న నేపథ్యంలో వచ్చే ఫిబ్రవరిలో ప్రారంభంకానున్న బడ్జెట్ సమావేశాల్లో వారి జీతాలపెంపు అంశాన్ని సభ ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







