రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరుమల తిరుపతిలో పర్యటన..
- December 24, 2015
రేపు తిరుమల తిరుపతిలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పర్యటించనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు రేణిగుండ విమానశ్రయానికి ఆయన చేరుకుంటారు. అక్కడి నుంచి 3.15 గంటలకు తిరుమల పద్మావతి అతిధి గృహానికి చేరుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 4.30 గంటలకు ప్రణబ్ శ్రీవారిని దర్శించుకుంటారు. సాయంత్రం 5.15 గంటలకు తిరుమల నుంచి ఆయన తిరుగు ప్రయాణమవుతారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నట్టు టీటీడీ అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రపతి బస చేసే పద్మావతి ప్రాంతంలోని గదులను టీటీడీ బ్లాక్ చేసినట్టు పేర్కొంది. ప్రోటోకాల్ పరిధిలోని వారికే వీఐపీ దర్శనాలు ఉంటాయంది. మధ్నాహ్నం 3 గంటలకు వృద్ధుల దర్శనం రద్దు చేస్తున్నట్టు టీటీడీ వెల్లడించింది. అంతేకాక వీఐపీ దర్శనాలను కుదింపు చేస్తున్నట్టు తెలిపింది. కాగా, తిరుమల తిరుపతిలో శుక్రవారం పౌర్ణమి సందర్భంగా మాడ విధుల్లో గరుడవాహనంపై శ్రీవారు ఊరేగనున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు







