అరకులో నేటి నుండి బెలూన్ ఫెస్టివల్
- January 18, 2019
విశాఖ : ఆంధ్రా కాశ్మీర్‌గా పేరు గాంచిన అరకులో నేటి నుండి మూడు రోజులు బెలూన్ ఫెస్టివల్ జరుగనుంది. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను నిర్వహిస్తుండగా.. దీనిలో భాగంగా అరకు ఏజెన్సీలో మూడు రోజుల పాటు బెలూన్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది. అరకు మండలం భల్లు గుడ, దళపతి గుడ సమీపంలో అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఈ ఫెస్టివల్‌లో పాల్గనేందుకు అంతర్జాతీయంగా పేరొందిన 15 దేశాలకు చెందిన పైలట్లు (బెలూన్లు నడిపేవారు) 20 బెలూన్లతో ఇప్పటికే అరకు చేరుకున్నారు. వీరితో పాటు అతిథుల మర్యాద కోసం తాత్కాలిక టెంట్లు ఏర్పాటు చేశారు. బెలూన్లలో షికార్ చేసేందుకు ఆన్‌ల్కెన్‌లో 4 వేల మంది నమోదు చేసుకున్నారు. బెలూన్లు 5 వేల అడుగుల ఎత్తు వరకు ఎగిరే అవకాశం ఉన్నప్పటికీ ఎయిర్ ట్రాఫిక్ నిబంధనల కారణంగా 2,500 అడుగుల ఎత్తున విహరించవచ్చు. దీంతో ఏజెన్సీ అందాలను ఆకాశం నుండే ఉచితంగా వీక్షించవచ్చు. ఒక్కో బెలూన్ గంటపాటు ఆకాశయానం చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇందులో ఒకసారి ఐదుగురు వెళ్లేందుకు వీలుగా ఏర్పాటు ఉంది.
ఈ విధంగా రోజుకి 70 మంది ఆకాశం నుంచి అరకు ఏజెన్సీ అందాలు చూసే అవకాశం ఉంటుంది. దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉన్నందున లాటరీ తీసి మొత్తం 210 మందికి ఆకాశయానం చేసే అవకాశం కల్పిస్తామని టూరిజయం శాఖ అధికారులు తెలిపారు. గత ఏడాది బెలూన్ ఫెస్టివల్ నిర్వహించినప్పటికీ వాతావరణం అనుకూలించక పోవడంతో రద్దయింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







