'PBD' లో పాల్గొనటానికి వారణాశి చేరుకున్న యూ.ఏ.ఈ బృందం

- January 20, 2019 , by Maagulf
'PBD' లో పాల్గొనటానికి వారణాశి చేరుకున్న యూ.ఏ.ఈ బృందం

వారణాసి:ప్రతి రెండు సంవత్సరాలకు భారత ప్రభుత్వం నిర్వహించే ప్రవాసీ భారతీయ దివస్ లో ప్రపంచవ్యాప్తంగా ప్రవాసీయులు పాల్గొంటారు.సుమారు 350 మంది NRI లు యూఏఈ నుండి ఈరోజు బయలు దేరివెళ్లారు.వారాణసి విమానాశ్రయంలో యూ.పి ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది.వివిధ దేశాలనుండి NRI బయలుదేరారు,ఈ బృందం లో మన తెలంగాణ ప్రాంతానికి ముగ్గురు మాత్రమే ఉన్నారు,అందులో ఆర్మూర్ మండల ఫతేపూర్ గ్రామానికి చెందిన ఏముల రమేష్(అధ్యక్షులు-ప్రవాసీ హక్కులు మరియు సంక్షేమ వేదిక దుబాయ్),జనగామ శ్రీనివాస్(జాయింట్ కో-ఆర్డినేటర్ -IPF)  మరియు గౌరి రెడ్డి  ఉన్నారు.మొత్తంఒక వారం రోజుల ప్రోగ్రాం లో మూడు రోజులు వారణాసి ,ఒక రోజు  కుంభ్ మేళ -ప్రయాగ్-అలహాబాద్ మరియు ఢిల్లీ లో  రిపబ్లిక్ డే రోజు 26th jan పరేడ్ గ్రౌండ్ యెర్ర కోట లో పాల్గొంటారు.యూ.ఏ.ఈ బృందానికి ప్రేమ్ చంద్(వైస్ కౌన్సెలర్) ఇంచార్జ్ గా వ్యవహరిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com