మిస్టర్ మజ్ను మూవీ రివ్యూ

- January 25, 2019 , by Maagulf
మిస్టర్ మజ్ను మూవీ రివ్యూ

ఈ ఏడాది సంక్రాంతి నాలుగు సినిమాలు వస్తే, ఇక తాజాగా శుక్రవారం అక్కినేని నటవారసుడు అఖిల్ నటించిన మిస్టర్ మజ్ను మూవీ ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఇప్పటీకే అఖిల్,హలొ సినిమాలతో వచ్చిన అఖిల్ ఈసారి రొమాంటిక్ హీరోగా మిస్టర్ మజ్నుతో ఆడియన్స్ ని పలకరించాడు. తొలిప్రేమ దర్శకుడు వెంకీ అట్లూరి ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. మొదటి సినిమా వరుణ్ తేజ్ తో తొలిప్రేమ మూవీ తీసి హిట్ కొట్టి కొత్తదనం చూపించాడు. ఇక అక్కినేని అఖిల్ గతంలో రెండు సినిమాలే చేసినప్పటికీ మూడవ సినిమా మిస్టర్ మజ్ను తీసుకుంటే ఇంతకుముందు ఎప్పుడు చేయని విధంగా ఈసినిమాలో ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో పనిచేసాడనని, అందుకే తన నటనను డిఫరెంట్ గా ప్రదర్శించాడని విశ్లేషకులు అంటున్నారు.

 
ఇక తన బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు పాత్రను ఎంచుకుని ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్ దక్కించుకోవాలన్న కసితో గల అఖిల్ కి మంచి సబ్జెక్ట్ దొరికిందని అంటున్నారు. ఆకతాయిగా తిరిగే కుర్రాడు గా అఖిల్ నటించాడు. అనుకోకుండా అతని జీవితంలోకి ఓ అమ్మాయి ఎంటర్ అవ్వడం, ఆమెతో ప్రేమలో పడడం, ఆమె ప్రేమను పొందడానికి అతడు చేసిన ప్రయత్నం, అది సక్సెస్ అవ్వడం ఇలా కథ, కధనం తో డైరెక్టర్ ఎక్కడా పట్టుతప్పకుండా చిత్రాన్ని నడిపించాడని అంటున్నారు.
 

తొలిప్రేమ మూవీకి డిఫరెంట్ గా మ్యూజిక్ అందించి సక్సెస్ అయిన తమన్, ఇప్పుడు మిస్టర్ మజ్నుకి కూడా సూపర్ మ్యూజిక్ అందించి బాగా ఆకట్టుకుంటున్నాడని చెబుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలోని పాటలు ఫోన్స్ లో మారుమోగిపోతున్నాయి. అనేక మలుపులతో హీరో హీరోయిన్స్ చుట్టూ కథ నడిచిన తీరు బాగుంటుంది. హీరో హీరోయిన్స్ కలుస్తారా లేదా అనే సస్పెన్న్స్ కొనసాగుతుంది. ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీని డైరెక్టర్ వెంకీ అట్లూరి బాగా హ్యాండిల్ చేసాడని,చివరి 40నిమిషాలు ఫామిలీ అండ్ లవ్ ఎమోషన్స్ తో స్క్రీన్ ప్లే నడిపించాడని విశ్లేషకులు అంటున్నారు.
 

మొదటి భాగంలో ఆకతాయిగా ఉంటూ, రెండవభాగంలో బాధ్యతాయుతమైన ప్రేమికుడిగా ఎలా మారాడు,తన ఫ్యామిలీకి నమ్మకం ఎలా కల్గించాడు వంటి కోణాలు చక్కగా చూపించాడు. ఎంతో క్వాలిటీతో సినిమాలు తీయడంలో దిట్టగా పేరొందిన నిర్మాత బివిఎస్ ఎన్ ప్రసాద్ ఎక్కడా ఖర్చుకి వెనుకాడకుండా మిస్టర్ మజ్ను తీశారు. రావు రమేష్, తదితరుల నటన కూడా ఆకట్టుకుంటుంది. అఖిల్ - నిధి అగర్వాల్ మధ్య లవ్ కెమిస్ట్రీ ఇలా అన్ని చక్కగా కుదిరాయని విశ్లేషకులు చెబుతున్న మాట.
 

గతంలో సవ్యసాచి మూవీలో నాగచైతన్యతో కల్సి నటించిన నిధి అగర్వాల్ మరోసారి తన ఫెర్ఫార్మ్న్స్ ఏమిటో నిరూపించుకుంది. అంతేకాదు. తొలి సినిమాకు,మలి సినిమాకు తేడాను స్పష్టంగా చూపించింది. యూత్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఉండే ఈసినిమా అందరికీ నచ్చుతుందని, అక్కినేని అభిమానులకు పండగ లాంటిదని అంటున్నారు. ఇక ఫైట్స్ , డాన్స్ లు కూడా గత రెండు సినిమాల కన్నా అఖిల్ భిన్నంగా ఆకట్టుకుంటాడని చెబుతున్నారు. 

--మాగల్ఫ్ రేటింగ్ 3.0 రేటింగ్ 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com