టమోటా పన్నీర్ కూర
- January 25, 2019
కావలసిన పదార్థాలు: పన్నీర్ : 200గ్రాములు, నూనె : 4 చెంచాలు, ఉల్లిపాయలు : 3, ఉప్పు : తగినంత, కారం : కొద్దిగా, ధనియాల పొడి : కొద్దిగా, పసుపు : చిటికెడు, టమోటా గుజ్జు : పావుకప్పు, క్రీమ్ : 3 చెంచాలు, కొత్తిమీర : కొంచెం
తయారు చేసే పద్ధతి :చెంచా నీళ్లలో కారం, ధనియాలపొడి, పసుపు కలిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఉల్లిపాయలు సన్నగా తరిగి ఉంచుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేసి చేసి ముం దుగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. అవి వేగాక ముందుగా నీళ్లలో కలిపిన మసాలా ముద్దను వేసి కలియతిప్పి పచ్చివాసన పోయా క టమోటా గుజ్జు, ఉప్పు వేసి కప్పు నీళ్లు పోసి మూత పెట్టాలి. పది నిమిషా లయ్యాక పన్నీరు ముక్కలు చేర్చా లి. గ్రేవీలో పన్నీరు ఉడి కాక క్రీమ్ వేసి పైన కొత్తిమీర చల్లి దించేయాలి. ఈ కూర ను రోటీలో తింటే రుచిగా ఉంటుంది.
తాజా వార్తలు
- క్రిప్టో కరెన్సీ, బ్లాక్ చైన్ సహా సరికొత్త ఆర్థిక నేరాలపై ఫోకస్: డీజీపీ అంజనీ కుమార్
- ముగిసిన హెచ్-1బీ వీసా అప్లికేషన్లు..
- మెక్సికో నగరంలో ఘోర అగ్నిప్రమాదం..39 మంది మృతి
- హైదరాబాద్ లో ఆస్కార్ విజేత చంద్రబోస్కు సత్కారం..
- జీ-20 సదస్సు-2023కు విశాఖ రెడీ
- ప్రజాగ్రహంతో దిగొచ్చిన ఇజ్రాయెల్ ప్రధాని..
- హైదరాబాద్ నగరాన్ని ఆహ్లాదకరంగా మార్చేందుకు కృషి
- పాన్-ఆధార్ లింక్ గడువు పెంపు..
- అదనపు ఆదాయాన్నిచ్చే ‘సెకండ్ శాలరీ’..!
- ఆకాశంలో కనువిందు చేయనున్న 5 గ్రహాలు..!