14న 'జెర్సీ' ఫస్ట్ సింగిల్
- February 11, 2019
నాని నటిస్తోన్న తాజా చిత్రం 'జెర్సీ'. క్రికెట్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో నాని క్రికెటర్‌గా కనిపింబోతున్నాడు. శ్రద్ధా శ్రీనాథ్ కథానాయిక. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్‌కు విశేషమైన స్పందన వచ్చిందని యూనిట్ చెబుతోంది. ఈ చిత్రం మొదటి గీతాన్ని ఈనెల 14న ప్రేమికుల రోజును పురస్కరించుకుని విడుదల చేయనున్నట్టు నాని ట్విట్టర్‌లో సోమవారం పేర్కొన్నారు. అదెంటోగానీ ఉన్నపాటుగా... అనే పల్లవితో సాగే ఆ గీతానికి సంబంధించి ఫొటోను కూడా ఈ సందర్భంగా విడుదల చేశాడు. ఈ పాటకి అనిరుధ్ స్వరాలు సమకూర్చారు. గౌతమ్ తిన్నూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నాగ వంశీ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







