తెలంగాణ:ఆన్‌లైన్‌లోనే మ్యారేజ్ ముస్లీం సర్టిఫికెట్
- February 11, 2019
హైదరాబాద్: ముస్లిములు మ్యారేజ్ సర్టిఫికెట్ల దరఖాస్తు కోసం వక్ఫ్‌బోర్డు కార్యాలయానికి రావాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకునే విధంగా ఈ-ఖజ్జత్(ఆన్‌లైన్‌లోనే మ్యారేజ్ సర్టిఫికెట్ల దరఖాస్తు) విధానాన్ని ప్రవేశపెడుతున్నట్టు హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. ఈ రోజు వక్ఫ్‌బోర్డు కార్యాలయంలో ఆన్‌లైన్‌లోనే మ్యారేజ్ సర్టిఫికెట్ల దరఖాస్తు విధానాన్ని మహమూద్ అలీ, వక్ఫ్‌బోర్డు ఛైర్మన్, ఎమ్మెల్సీ సలీం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఈ విధానం లేదని, ప్రజల సమస్యల పరిష్కారాన్ని మరింత సులభతరం చేసేందుకే ఈ-ఖజ్జత్ విధానాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. గతంలో ప్రతి రోజు 300 నుంచి 400 మంది వరకు మ్యారేజ్ సర్టిఫికెట్ల దరఖాస్తుల కోసం వక్ఫ్‌బోర్డు కార్యాలయానికి వచ్చే వారని, ఇప్పుడు ఆ సమస్య తలెత్తదన్నారు. రాష్ట్రంలో ఎక్కడ నుంచైనా మ్యారేజ్ సర్టిఫికెట్ కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుని, గడువు తేదీన కార్యాలయానికి వచ్చి సర్టిఫికెట్ తీసుకునే అవకాశం కలుగుతుందన్నారు. WAQF.TELANGANA.GOV.IN వెబ్‌సైట్‌లో సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







