పది గ్రాముల పసిడి ధర రూ.25,605
- December 28, 2015
సోమవారం బంగారం ధర తగ్గింది. రూ.85 తగ్గడంతో 99.9శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ.25,605కు చేరింది. కీలక సమయాల్లో నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించకపోవడం, బలహీనంగా ఉన్న ఆసియన్ మార్కెట్ల ప్రభావంతో దేశీయంగా దీని ధర తగ్గిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా ధరల్ని ప్రభావితం చేసే సింగపూర్ బులియన్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.4శాతం తగ్గి 1,071.72 అమెరికన్ డాలర్లకు చేరింది. ఈ రోజు వెండి ధర తగ్గి రూ.34,000 దిగువకు చేరింది. రూ.320 తగ్గడంతో కేజీ వెండి ధర రూ.33,980కి చేరింది. అంతర్జాతీయంగా సింగపూర్ బులియన్ మార్కెట్లో ఔన్సు వెండి ధర 0. 7శాతం తగ్గి 14.26 అమెరికన్ డాలర్లకు చేరింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







