భారత విదేశాంగ శాఖ మీడియా సమావేశం..ఆ వివరాలు..
- February 27, 2019
భారత యుద్ధ విమానాలను కూల్చామన్న పాక్ వాదనల నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ విలేఖర్లతో మాట్లాడారు. ఆ వివరాలు..
'తీవ్రవాదం వ్యతిరేక చర్యల్లో భాగంగా భారత్ నిన్న పాకిస్తాన్లో ఉన్న జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసింది.
భారత్ చర్యలకు వ్యతిరేకంగా పాకిస్తాన్ ఈ ఉదయం స్పందించింది.
పాక్ తమ వైమానిక దళంతో దాడికి ప్రయత్నించింది.
అప్రమత్తంగా ఉన్న భారత వైమానిక దళం పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ప్రయత్నాన్ని తిప్పికొట్టింది.
పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ఒక ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్‌ను మన మిగ్ 21 బైసన్ విమానంతో కూల్చేశాం.
ఆ విమానం పాకిస్తాన్ భూభాగంలో కూలిపోవడం మన ఆర్మీ చూసింది.
అదే సమయంలో మనం దురదృష్టవశాత్తూ ఒక మిగ్ 21 కోల్పోయాం.
ఆ విమానంలో పైలెట్ మిస్ అయ్యారు.
అయితే ఆ పైలెట్ తమ కస్టడీలో ఉన్నట్టు పాకిస్తాన్ పేర్కొంటోంది.
ఇందులోని వాస్తవాలను భారత ప్రభుత్వం నిర్ధారించుకునే పనిలో ఉంది.'
తాజా వార్తలు
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!







