భారత్‌పై దాడికి 18వేల మంది తాలిబన్ల సాయం ..

- February 27, 2019 , by Maagulf
భారత్‌పై దాడికి 18వేల మంది తాలిబన్ల సాయం ..

భారత్ నుంచి గట్టి ప్రతిఘటన ఉన్నా పాకిస్తాన్ కవ్వింపు చర్యలు తగ్గించడం లేదు. అటు ఆఫ్గన్ బోర్డర్ లో ఉన్న బలగాలను భారత సరిహద్దుల్లోకి తరలిస్తున్నారు. అటు స్వాత్ లోయలో ఉన్న సుమారు 18వేల మంది తాలిబన్ల సాయం కూడా కోరినట్టు తెలుస్తోంది. వారందరినీ ఇండియా సరిహద్దుల్లోకి తరలిస్తున్నారు. ఐఎస్ఐ సాయంతోనే వారంతా ప్రత్యేక విమానాల్లో చేరుకుంటున్నట్టు తెలుస్తోంది. ఎలాంటి దాడులకైనా సిద్దమనే సంకేతాలు ఇస్తుంది. అటు తీవ్రవాద సంస్థలు, ఛాందసవాదుల నుంచి వస్తున్న ఒత్తిడితో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఇబ్బందుల్లో పడుతోంది. యుద్ధం వల్ల జరిగే నష్టాలు తీవ్రంగా ఉంటాయని తెలిసినా ఒత్తిడితో కవ్వింపు చర్యలకు దిగుతోంది. పాకిస్తాన్ పార్లమెంట్ ఉభయసభల సమావేశం ఏర్పాటు చేశారు. అటు సైనిక చర్యలకు సిద్దంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చారు.

తాలిబన్లనే కాకుండా జైష్‌ ఎ మహ్మద్‌, అల్ ఖైదా, కాశ్మీర్‌లో ఉన్న వేర్పాటువాదుల సహాయంతో భారత్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు పాక్ ప్రయత్నిస్తోంది. 18వేల మంది తాలిబన్లనే కాకుండా ఇరాక్,ఆఫ్ఘాన్ సరిహద్దులలో ఉన్న వందల మంది టెర్రరిస్ట్ గ్రూపులను ఇండియాపై ఉసిగొల్పేందుకు సిద్దమవుతోంది. ముంబై దాడుల్లాగే దేశం మెుత్తం రక్త పాతం సృష్టించాలనే ఆలొచనలో ఉగ్రవాదులను ప్రేరేపించే దిశగా పధకాలు రచిస్తోంది.సైనిక చర్యలకు సిద్దంగా ఉండాలని ఆర్మీ చీఫ్ ఇమ్రాన్ కు ఇప్పటికే సంకేతాలు అందాయి. అటు సైనిక బలంతో ఇటు ఉగ్రదాడులతో ముప్పేటదాడులకు పాక్ సన్నద్దమవుతున్నట్లు సమాచారం. పాకిస్తాన్ తను కూర్చున్న కొమ్మను తానే నరుక్కుంటుందనే విషయాన్ని మరిచి హింసాత్మక చర్యలతో పంతాన్ని నెగ్గించుకోవాలని చూస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com