పాకిస్తాన్‌కి విమానాల్ని రద్దు చేసిన ఒమన్
- February 27, 2019
మస్కట్: భారత్ - పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఒమన్ ఎయిర్, పాకిస్తాన్‌కి విమానాల్ని రద్దు చేసింది. పాకిస్తాన్ వ్యాప్తంగా ముఖ్యమైన ఎయిర్‌పోర్ట్‌లన్నిటిలోనూ పౌర విమాన సేవలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌కి వివిధ దేశాల నుంచి వెళ్ళాల్సిన విమానాలు రద్దయ్యాయి. పాకిస్తాన్ నుంచి కూడా విదేశాలకు విమానాలు వెళ్ళేందుకు వీలు లేకుండా పోయింది. ఒమన్‌తోపాటు, యూఏఈ సహా అన్ని దేశాలూ పాకిస్తాన్‌తో పౌర విమాన యానానికి సంబంధించి సంబంధాల్ని తాత్కాలికంగా తెంచుకోవాల్సి వచ్చింది. ఆయా విమానాశ్రయాల్లో పాకిస్తాన్‌కి వెళ్ళేందుకు సిద్ధమైన ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా, తాత్కాలికంగా భారతదేశంలోని కొన్ని విమానాశ్రయాలకు విమానాలు రద్దు కాగా, సాయంత్రానికి పునరుద్ధరించబడ్డాయి.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







