ఐరన్ మ్యాన్: ఒమన్‌లో ప్రముఖ రోడ్ల మూసివేత
- February 28, 2019
మస్కట్: మార్చి 1న ఐరన్ మ్యాన్ 70.3 కాంపిటీషన్ సందర్భంగా ఒమన్‌లోని పలు ముఖ్యమైన రోడ్లను బ్లాక్ చేయనున్నారు. రాయల్ ఒమన్ పోలీస్ ఈ మేరకు ప్రకటన జారీ చేసింది. ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు మినిస్ట్రీ స్ట్రీట్ వద్ద అల్ తకాఫా రౌండెబౌట్ వరకు మూసివేస్తారు. సుల్తాన్ కబూస్ స్ట్రీట్‌లో కుర్రుమ్ బ్రిడ్జి నుంచి దరైసిత్ వరకు ఉదయం 6 గంటల నుంచి 12 గంటల మధ్య మూసివేస్తారు. మట్రా కోర్నిచ్పై ఉదయం 6.30 నిమిషాల నుంచి 9.30 నిమిషాల వరకు, దర్సిత్ బ్రిడ్జిపై ఉదయం 6.30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, వాడి అడాయ్ బ్రిడ్జిపై ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రోడ్లను బ్లాక్ చేస్తారు. అల్ అమెరాత్ రస్టీట్పై ఓ లేన్ని ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు మూసివేయనున్నారు. మరికొన్ని రోడ్లపైనా ఆయా సమయాల్లో 'బ్లాక్' చేయడం జరుగుతుందని రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. 54 దేశాలకు చెందిన వెయ్యి మంది పోటీదారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. 1.9 కిలోమీటర్ల స్విమ్మింగ్, 90 కిలోమీటర్ల సైక్లింగ్, 21.1 కిలోమీటర్ల రన్నింగ్ పోటీలు ఈ ఈవెంట్లో భాగం.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







