మెయిన్ లైన్ నుంచి నీటిని దొంగిలిస్తున్న ఓ మహిళకు న్యాయస్థానం మూడు నెలల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. కోర్టు ఫైల్స్ ప్రకారం, ఎలక్ట్రిసిటీ మరియు వాటర్ అథారిటీ నుంచి ఎలాంటి రుసుములు లేకుండా సదరు మహిళ నీటి సౌకర్యాన్ని పొందుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఉల్లంఘనకు సంబంధించిన సమాచారాన్ని అందుకున్న అధికారి, తనిఖీలు చేపట్టగా ఉల్లంఘన బయటపడింది. ఇసా టౌన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అనుమతి లేకుండా అక్రమంగా మెయిన్ లైన్‌కి అదనంగా కనెక్షన్ ఏర్పాట్లు చేసుకుని నీటిని దొంగతనం చేస్తున్నట్లు సదరు మహిళపై ఆరోపణలు మోపబడ్డాయి.