ఏప్రిల్ 1 నుంచి జెట్ ఎయిర్వేస్ విమానాలు బంద్
- March 19, 2019
ముంబై:సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎయిర్‌వేస్‌కు మరో సవాల్ ముంచుకొచ్చింది. ఈ మాసాంతంలోగా జీతాలు చెల్లించకుంటే విమానాలు పైకి ఎగరవని, తమ సేవలు నిలిపివేస్తామని పైలట్లు జెట్ ఎయిర్‌వేస్ యాజమాన్యాన్ని హెచ్చరించారు. కంపెనీ దేశీయ పైలట్లతో కూడిన నేషనల్ ఏవియేటర్స్ గిల్డ్‌లో మంగళవారం విస్తృతంగా చర్చించిన అనంతరం వారు ఈ ప్రకటన చేశారు.
సంస్థను చక్కదిద్దే ప్రణాళికపై స్పష్టత రాకున్నా, వేతన చెల్లింపులపై పరిష్కారం లభించకపోయినా ఏప్రిల్ 1 నుంచి తాము విధులకు హాజరుకాబోమని గిల్డ్ స్పష్టం చేసింది. వేతనాలపై యాజమాన్యం నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో ఏవియేటర్స్ గిల్డ్ గతవారం కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వర్‌కు లేఖ రాసింది.
తాజా వార్తలు
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత







