డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.వైరస్.కామ్
- December 29, 2015
హృదయకాలేయం సినిమా సక్సెస్ తరువాత టాలీవుడ్ టాప్ స్టార్ లకు ధీటుగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు సంపూర్ణేష్ బాబు. సోషల్ మీడియా స్టా ర్ గా పేరు తెచ్చుకున్న ఈ బర్నింగ్ స్టార్, ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల్లో కూడా స్పెషల్ క్యారెక్టర్లు చేస్తూ తన ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. స్పెషల్ క్యారెక్టర్ లతో పాటు హీరోగానూ కెరీర్ ను కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే కొబ్బరి మట్ట సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సంపూర్ణేష్ బాబు, మరో ఇంట్రస్టింగ్ టైటిల్ తో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు.డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.వైరస్.కామ్ పేరుతో ఓ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ ను రెడీ చేస్తున్నాడు సంపూర్ణేష్ బాబు.సిహెచ్ రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో గీతాషా హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను ఫిబ్రవరిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. హృదయకాలేయం సినిమాతో సెన్సేషనల్ సక్సెస్ అందుకున్న సంపూ మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ చేస్తాడేమో చూడాలి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







