30 వేలకు పైగా వరల్డ్ మ్యాపులను తగలపెట్టిన డ్రాగన్ దేశం
- March 26, 2019
బీజింగ్: అరుణాచల్ ప్రదేశ్, తైవాన్లను చైనాలో అంతర్భాగంగా చూపించలేదన్న అక్కసుతో చైనా కస్టమ్స్ అధికారులు తమ దేశంలో తయారైన 30 వేల ప్రపంచ పటాలను తగులబెట్టేశారు. భారత ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ తమదేననీ... సౌత్ టిబెట్ అది కూడా భాగమేనని చైనా వాదిస్తున్న సంగతి తెలిసిందే. భారత నాయకులు అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించినప్పుడెల్లా తరచూ ఇదే అంశాన్ని లేవనెత్తుతోంది. కాగా అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగమేననీ, దీనిపై తమకు శాశ్వత హక్కులు ఉన్నాయని భారత్ స్పష్టం చేస్తూ వస్తోంది. దీంతో పాటు తరచూ దేశంలోని మిగతా ప్రాంతాల్లానే అరుణాచల్ ప్రదేశ్‌కి కూడా భారత నేతలు పర్యటనలు చేస్తున్నారు. కాగా 3,488 కిలోమీటర్ల వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి ఉన్న సరిహద్దు వివాదాలను పరిష్కరించుకునేందుకు ఇరు దేశాలమధ్య ఇప్పటికి 21 సార్లు చర్చలు జరిగాయి.
మరోవైపు ద్వీపదేశం తైవాన్ కూడా తమదేనంటూ చైనా ఆరోపిస్తోంది. గుర్తుతెలియని దేశానికి ఎగుమతి చేసేందుకు తరలిస్తున్న ఈ మ్యాపులను చైనా కస్టమ్స్ అధికారులు గుర్తించి అడ్డుకున్నారు. తైవాన్ను ప్రత్యేక దేశంగా పేర్కొన్నారనీ, చైనా-భారత్ సరిహద్దు వివరాలు కూడా ''సరిగాలేవని'' చెబుతూ దాదాపు 30 వేలకు పైగా వరల్డ్ మ్యాపులను డ్రాగన్ దేశం తగుపెట్టినట్టు స్థానిక మీడియా వెల్లడించింది.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!