మాధురి చెప్తున్న ప్రేమ కధ
- March 28, 2019
అర్థవంతమైన చిత్రాల్లో భాగమవ్వాలని కోరుకుంటున్నానని చెబుతోంది బాలీవుడ్ తార మాధురీ దీక్షిత్. నిన్నటితరాన్ని తన అందంతో, నృత్యాలతో ఊపేసిన ఈ అందాల భామ.ఇప్పటికీ హిందీ తెరపై వన్నె తరగని ప్రభావాన్ని చూపిస్తోంది. అయితే అప్పట్లోలా కాకుండా ఆచితూచి మంచి సినిమాలను ఎంచుకుంటోంది. ఎదిగిన తర్వాత కూడా గతంలోలా నటించలేం కదా అన్నది మాధురీ మాట. నెట్ ఫ్లిక్స్ కోసం ఆమె నిర్మించిన చిత్రం ఆగస్టు 15. ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మాధురీ దీక్షిత్ మాట్లాడుతూ..అర్థవంతమైన సినిమాల్లో నటించాలని, వీలు కానప్పుడు అలాంటి చిత్రాలకు అండగా నిలబడాలని నేనెప్పుడూ కోరుకున్నాను. నా కోరిక నెరవేర్చుకునేందుకు ఆగస్టు 15 సినిమా కంటే గొప్ప కథ ఉండదేమో. ఇది మనల్ని మనం పోల్చుకునే సినిమా. నటీనటులు, సాంకేతిక నిపుణులు కథకు అందమైన రూపాన్నిచ్చారు. అని చెప్పింది. ఆగస్టు 15 ఒక ప్రేమ కథ.
ప్రేమ, స్వాతంత్య్రం గొప్పదనం గురించిన అంశాలుంటాయి. ముంబైలోని ఓ ప్రాంతం ఆగస్టు పదిహేను స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలకు సిద్ధమవుతుంది. ఇంతలో ఓ ప్రేమికుడు తన ప్రేమకున్న అడ్డంకులు తొలగేందుకు సహాయం చేయమని ఆ ప్రాంత ప్రజలను కోరుతాడు. ఆ ప్రేమ జంట కోరికకు స్థానిక ప్రజలు ఎలా స్పందించారు. ఈ క్రమంలో వాళ్లకు ప్రేమ గొప్పదనం ఎలా తెలిసింది అనేది ఆగస్టు15 చిత్ర కథాంశం. ఇదంతా ఒక రోజులో జరుగుతుంది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







