హౌతీ డ్రోన్ల కూల్చివేత: ఐదుగురికి గాయాలు
- April 03, 2019
రియాద్: హౌతీ ద్రోన్ల ద్వారా దాడులకు యెమెన్ తీవ్రవాదులు ప్రయత్నించగా, సౌదీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ చాకచక్యంగా ఈ దాడుల్ని తిప్పికొట్టాయి. అయితే ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. గాయపడ్డవారిలో ఓ మహిళ ఓ చిన్నారి వున్నారు. జనావాసాలే లక్ష్యంగా హౌతీ తీవ్రవాదులు ఈ డ్రోన్లను ప్రయోగించినట్లు సౌదీ ఎయిర్ డిఫెన్స్ వర్గాలు వెల్లడించాయి. శకలాలు జనావాసాల్లో కూలడంతో స్వల్పంగా కొందరికి గాయాలయినట్లు అధికారులు వివరించారు. ఈ క్రమంలో కొన్ని ఇళ్ళు కూడా దెబ్బతిన్నాయి. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించి, వైద్య చికిత్స అందించారు.
తాజా వార్తలు
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి







