శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్ ESL నరసింహన్ దంపతులు
- April 09, 2019
తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని రెండు తెలగు రాష్ట్రాల గవర్నర్ ESL నరసింహన్ దంపతులు మంగళవారం దర్శిచుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో గవర్నర్ దంపతులు స్వామి వారి సేవలో పాల్గొన్నారు. అంతకుముందు వారు క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ శ్రీవరాహస్వామిని దర్శించుకున్నారు. గవర్నర్ దంపతులు శ్రీవారి పుష్కరిణిలోకి చేరుకొని పవిత్ర జలాలను ప్రోక్షణం చేసుకున్నారు. అనంతరం శ్రీవారి ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న గవర్నర్ దంపతులకు తితిదే ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, తిరుమల ఇన్‌ఛార్జి జేఈవో లక్ష్మీకాంతం ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికి, మేళతాళాలతో శ్రీవారి సన్నిధికి తీసుకెళ్లారు. స్వామి వారి దర్శనానంతరం హుండీలో కానుకలు సమర్పించారు. రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం పలుకగా తీర్థప్రసాదాలను, స్వామివారి చిత్రపటాన్ని గవర్నర్ దంపతులకు తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ , జేఈవో లక్ష్మి కాంతం అందజేసి సత్కరించారు.



తాజా వార్తలు
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు







