జిమ్నాస్టిక్స్ చేస్తూ రెండు కాళ్లూ విరగ్గొట్టుకున్న ‘సమంత’..
- April 09, 2019
తీగలా బాడీని మెలికలు తిప్పేస్తూ గాల్లో ఎగురుతూ చూసే వారికి వావ్ అనిపించే విన్యాసాలు ప్రదర్శిస్తుంటారు జిమ్నాస్టిక్స్ క్రీడాకారులు. ఎక్కువగా అమ్మాయిలే ఈ క్రీడను ఎంచుకుంటారు. చిన్నప్పటినుంచే ఈ క్రీడలో ప్రావీణ్యం సంపాదించినా ఒక్కోసారి టైమ్ బాగోపోతే గాయాలపాలు కావాల్సి వస్తుంది. జమ్నాస్టిక్స్ను ప్రాణంగా భావించే ఓ క్రీడాకారిణి తన రెండు కాళ్లను విరగ్గొట్టుకొని కెరీర్‌కే గుడ్‌బై చెప్పింది.
అమెరికాలో ఆబర్న్ యూనివర్సిటీకి చెందిన సమంతా సెరియో అనే జిమ్నాస్ట్.. బేటన్ రోగ్ రీజనల్ పోటీల్లో పాల్గొంది. ఫస్ట్ రౌండ్ చేస్తున్న సమయంలో ఆమె ఎగిరి మ్యాట్ పై ల్యాండ్ అయ్యింది. కానీ అదే సమయంలో ల్యాండింగ్ అదుపు తప్పి రెండు మోకాళ్ల వద్ద విరిగిపోయాయి. నొప్పితో విలవిలలాడిన సమంత కూర్చున్న చోటు నుంచి లేవలేకపోయింది. డాక్టర్లు వచ్చి ఆమెను స్ట్రెచర్‌పై ఆసుపత్రికి తీసుకు వెళ్లారు.
సమంత సరైన శిక్షణ లేకుండా హ్యాండ్స్ప్రింగ్ ఫ్రంట్ ప్లిప్ చేసి ఉండవచ్చని అందువల్లే కాళ్లు విరిగిపోయాయని జిమ్నాస్టిక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆసుపత్రి బెడ్‌పై ఉన్న ఆరోజే జిమ్నాస్టిక్స్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించింది. గత 18 ఏళ్లుగా దీన్నే కెరీర్‌గా భావించానని.. దురదృష్టం కొద్ది ఈ రోజు ఇలా అయిందని వివరించింది. తనకు ఇష్టమైన ఆటకు దూరమవుతున్నందుకు బాధగా ఉందని పేర్కొంది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







