విద్యార్థుల అస్వస్థతో దుబాయ్ స్కూల్‌కి రెండు రోజుల సెలవు
- April 11, 2019
దుబాయ్ స్కూల్, విద్యార్థుల అనారోగ్యం కారణంగా రెండు రోజులు మూతపడింది. వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు భావిస్తున్నారు. దుబాయ్‌లోని అల్ గర్హౌద్లో గల కిండర్‌గార్టెన్ స్టార్టర్స్, తమ విద్యార్థుల తల్లిదండ్రులకు స్కూల్ సెలవుల విషయమై సమాచారం అందించింది. ఏప్రిల్ 10, 11 తేదీల్లో స్కూల్‌ని మూసివేసి, డీప్ క్లీన్ చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. దుబాయ్ మునిసిపాలిటీ మరియు దుబాయ్ హెల్త్ అథారిటీ ఈ స్కూల్‌ని ఇప్పటికే సందర్శించడం జరిగింది. నాలెడ్జ్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ అథారిటీకి సైతం సమాచారం ఇచ్చారు. వివిధ క్లాసులకు చెందిన ఆరుగురు విద్యార్థుల తల్లిదండ్రులు, తమ పిల్లలకు అనారోగ్య సమస్యలు తలెత్తాయనీ వాంతులు, జ్వరంతో వారు బాధపడుతున్నారనీ ఫిర్యాదు చేయడంతో స్కూల్ యాజమాన్యం ఈ చర్యలు చేపట్టింది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







