సెల్ఫీ తీస్తే 500,000 దిర్హామ్ల జరీమానా!
- April 12, 2019
యూ.ఏ.ఈ:వెడ్డింగ్ లేదా ప్రైవేట్ పార్టీల్లో అవతలి వ్యక్తుల అనుమతి లేకుండా సెల్ఫీ తీసుకుంటే అది సీరియస్ క్రైమ్గా మారే ప్రమాదముంది. ఇందుకుగాను 500,000 దిర్హామ్ల జరీమానా ఎదుర్కోవాల్సి రావొచ్చునని లాయర్ నౌరా సలెహ్ అల్ హజ్రి చెబుతున్నారు. ఇటీవలి కాలంలో ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయనీ, ఈ నేపథ్యంలో సెల్ఫీ తీసుకోవాలనుకునేవారు ఖచ్చితంగా అప్రమత్తంగా వుండాలని లాయర్ నౌరా సలెహ్ హెచ్చరించారు. సైబర్ క్రైమ్ చట్టాలు కఠినంగా వున్నాయనీ, సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం సరదాగా మాత్రమే తీసుకుని, ఇతర విషయాల్ని పట్టించుకోకపోతే అవి సమస్యల్లోకి నెట్టేస్తాయని అధికారులు అంటున్నారు. సో, సెల్ఫీ తీసుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి. వాటిని పోస్ట్ చేసే ముందు మరింత జాగ్రత్త తీసుకోవాల్సిందే.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







