లంగ్స్‌లో ఇరుక్కున్న వాల్‌ నట్‌: బాలుడికి సర్జరీ

- April 16, 2019 , by Maagulf
లంగ్స్‌లో ఇరుక్కున్న వాల్‌ నట్‌: బాలుడికి సర్జరీ

బహ్రెయిన్:సల్మానియా మెడికల్‌ కాంప్లెక్స్‌ మెడికల్‌ ఓటీమ్‌, నాలుగేళ్ళ బాలుడికి సర్జరీ నిర్వహించి అతని ప్రాణాల్ని రక్షించడం జరిగింది. బాలుడి లంగ్స్‌లో ఇరుక్కున్న వాల్‌ నట్‌ తాలూకు ముక్కల్ని సర్జరీ ద్వారా వైద్యులు తొలగించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ సర్జరీలో నిష్ణాతులైన వైద్య నిపుణులు పాల్గొన్నట్లు హెల్త్‌ మినిస్ట్రీ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇఎన్‌టి సర్జన్‌, చెస్ట్‌ యూనిట్‌ నిపుణులు అత్యంత చాకచక్యంగా సర్జరీ నిర్వహించినట్లు మినిస్ట్రీ అధికారి వివరించారు. ఈ సర్జరీలో డాక్టర్‌ ఒసామా అబ్దుల్‌ కరీమ్‌, డాక్టర్‌ డినా సాహిబ్‌, డాక్టర్‌ రామ్జి, డాక్టర్‌ హుస్సేన్‌, డాక్టర్‌ హలా రాధి పాల్గొన్నారు. అత్యాధునిక వైద్య పరికరాలతో సర్జరీ నిర్వహించినట్లు ఆసుపత్రి యంత్రాంగం పేర్కొంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com