చిలీ దేశంలో ఇంటిపై కూలిన విమానం...ఆరుగురి మృతి

- April 17, 2019 , by Maagulf
చిలీ దేశంలో ఇంటిపై కూలిన విమానం...ఆరుగురి మృతి

ప్యూర్టో మాంట్ : చిలీ దేశంలో ఓ విమానం కూలిన ఘటనలో ఆరుగురు మరణించారు. ఆర్చిపియోలాగోస్ ఎయిర్ కంపెనీకి చెందిన విమానం ప్రమాదవశాత్తూ ఓ ఇంటిపై కూలింది. ఈ ఘటనలో పైలెట్ తోపాటు ఐదుగురు ప్రయాణికులు మరణించారు. ఈ ఘటనలో ఓ మహిళ కాళ్లు విరిగాయి. దీంతో గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించారు. విమాన ప్రమాదానికి కారణాలు తెలియరాలేదని ప్యూర్టో మాంట్ మేయరు హారీ జుర్గెన్ సన్ చెప్పారు. విమానం కూలిన ఇంట్లో ఎవరూ లేరని మేయరు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com