ప్రముఖ ఐటీ కంపెనీలకు సైబర్ ముప్పు హెచ్చరిక
- April 21, 2019
ప్రముఖ ఐటీ కంపెనీలకు సైబర్ అటాక్ ప్రమాద హెచ్చరిక!! ఈ మేరకు క్రెబ్స్ఆన్‌సెక్యూరిటీ ఫౌండర్ బ్రియాన్ క్రెబ్స్ ఈ మేరకు అలర్ట్ చేశారు. దేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీలకు సైబర్ నేరగాళ్ల నుంచి ముప్పు ఉందని ఈ సైబర్‌సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్ వెబ్‌సైట్ క్రెబ్స్‌ఆన్‌సెక్యూరిటీడాట్‌కామ్ చెబుతోంది. బ్రియాన్ క్రెబ్స్ వాషింగ్టన్ పోస్ట్ మాజీ ఉద్యోగి, సైబర్ సెక్యూరిటీ రైటర్. ఈయన ఆధ్వర్యంలో ఈ వెబ్‌సైట్ నడుస్తోంది.
విప్రోలాగా ఇన్ఫోసిస్, క్యాప్ జెమినిలు టార్గెట్ ఈ రిపోర్ట్స్ ప్రకారం విప్రోలాగా ఇన్ఫోసిస్, క్యాప్‌జెమిని, కాగ్నిజెంట్ వంటి పలు ప్రధాన సంస్థలను సైబర్ మోసగాళ్లు టార్గెట్ చేయాలని చూస్తున్నారు. వీటితో పాటు రిటైల్, ఫైనాన్షియల్, కన్సల్టింగ్ కంపెనీస్‌ను కూడా అప్రమత్తం చేశారు. సైబర్ అటాకర్స్ గిఫ్ట్ కార్డు రూపంలో ఫ్రాడ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నరని బ్రియాన్ క్రెబ్స్ పేర్కొన్నారు. కాగా, తమ ఉద్యోగుల్లో కొందరి ఖాతాలు హ్యాకింగ్‌కు గురైనట్లు ఇప్పటికే విప్రో అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ క్రమంలో క్యాప్‌జెమినీ సైతం ఇదే తరహా దాడులను గుర్తించామని పేర్కొంది. అదే సమయంలో నివారణ చర్యలు తీసుకున్నామని, దీంతో ఎలాంటి నష్టం లేదని పేర్కొంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..