జెట్ ఎయిర్వేస్ విమానాలపై ఎయిర్‌ఇండియా ఆసక్తి
- April 21, 2019
ముంబయి: ఎయిర్ ఇండియా అంతర్జాతీయ మార్గాలను చూసే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంక్షోభంలో ఉన్న జెట్ ఎయిర్‌వేస్‌కు చెందిన బోయింగ్ 737 విమానాలను లీజుకు తీసుకోవాలని యోచిస్తోంది. ఇప్పటికే ఈ విమానాలకు చెల్లింపులు జరపకపోవడంతో పలు విమానాశ్రయాల్లో నిలిపి ఉంచారు. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని కంపెనీ అధికారులు చెబుతున్నారు.
ఏప్రిల్ 16వ తేదీనాటికి జెట్‌సంస్థ మొత్తం విమానాలను పక్కనపెట్టింది. దీంతో ఆ సంస్థ నుంచి దేశీయ, అంతర్జాతీయ సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో జెట్‌కు చెందిన విమానాలను తీసుకునే అంశాన్ని ఎయిర్ ఇండియా ఇప్పటికే చర్చించింది. దీని కింద ఐదు 777 విమానాలను తీసుకొనే అవకాశం ఉంది. ''మేము విమానాలను లీజుకు తీసుకుందాం అనుకుంటున్నాం. కానీ దీనిపై ఎటువంటి చర్చలు జరగలేదు. ఈ విషయం వివిధ అంశాలతో ముడిపడి ఉంది. '' ఎయిర్ ఇండియా ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ శ్యామ్ కె సుందర్ పీటీఐకి తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







