ఎమిరేట్స్ పోస్ట్‌కి అనుకోని అతిథిని పంపిన షేక్ మొహమ్మద్
- April 23, 2019
దుబాయ్: వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యూఏఈ మరియు దుబాయ్ రూలర్ అయిన షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, పూర్ సర్వీసుల్ని సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ మెసేజ్ పోస్ట్ చేశారాయన. ఎమిరేట్స్ పోస్ట్‌కి ఓ అనుకోని అతిథిని పంపిన షేక్ మొహమ్మద్, అక్కడి పరిస్థితుల్ని స్వయంగా తెలుసుకున్నారు. క్యూ లైన్లలో ఆ అతిథి నిల్చుని వున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, సర్వీసుల్లో ఆలస్యం చాలా బాధాకరమని చెప్పారు. ఎమిరేట్స్ పోస్ట్ సర్వీసెస్ విషయమై వాస్తవ పరిస్థితుల్ని తెలిపేందుకు టీమ్‌ని పంపిన షేక్ మొహమ్మద్, అక్కడి సర్వీసులు తగిన విధంగా లేవని నిర్ధారణకు వచ్చారు. కాగా, గవర్నమెంట్ బాడీస్‌కి ఎంప్లాయీ శాటిస్ఫాక్షన్ విషయమై హెచ్చరికలు జారీ చేశారు. కొన్ని సంస్థలు ఎంప్లాయీ శాటిస్ఫాక్షన్ విషయంలో 93 శాతం ప్రగతిని సాధించాయని చెప్పారు. ఐదు సంస్థలు మాత్రం 60 శాతానికే పరిమితమయ్యాయి. దీన్ని సహించేది లేదనీ, ఎంప్లాయీ శాటిస్ఫ్యాక్షన్ అతి ముఖ్యమైనదనీ అన్నారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







