తిరుపతి:వీడియో కాల్‌లోనే ఆత్మహత్య చేసుకున్నాడు
- April 23, 2019
తిరుపతి:నేటి యువతలో ఆలోచన కంటే ఆవేశం ఎక్కువగా కనిపిస్తుంది. వ్యసనాలకు బానిసలుగా మారి అర్ధాంతరంగా జీవితాన్ని ముగించుకుంటున్నారు. ఆవేశపూరిత నిర్ణయాలతో భవిష్యత్ శూన్యం చేసుకుంటున్నారు. తాజాగా తిరుపతికి చెందిన శివకుమార్ అనే యువకుడు ఆదివారం అర్ధరాత్రి తాగిన మైకంలో ఆత్మహత్య చేసుకున్నాడు. స్నేహితుడికి వీడియో కాల్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నానని చేప్పి లైవ్‌లోనే దారుణానికి పాల్పడ్డాడు. చనిపోతున్నా… చూడు అంటూ ఫ్యాన్‌కు ఉరేసుకుని మంచంపై నిలబడ్డాడు. స్నేహితుడు దాన్ని తమాషా అనుకున్నాడు. కానీ మంచంపై నుంచి కాలు కిందకు వేలాడడం చూసి హుటాహుటిన అతని దగ్గరకు పరిగెత్తాడు. అప్పటికే ఆ యువకుడు ప్రాణాలు విడిచాడు. శివకుమార్ తిరుపతిలో మెకానిక్‌గా పని చేస్తున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







