హైదరాబాద్ లో హీరా గ్రూప్‌పై కేసు నమోదు

- April 26, 2019 , by Maagulf
హైదరాబాద్ లో హీరా గ్రూప్‌పై కేసు నమోదు

హైదరాబాద్:వేల కోట్ల స్కామ్‌కు పాల్పడిన హీరా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ప్రత్యేక దృష్టి పెట్టింది. నౌహీరా షేక్‌ దాదాపు రూ.5700 కోట్ల మేర ఆర్థిక లావాదేవీలు నిర్వహించారు. హీరా గ్రూప్‌పై కేసు నమోదు చేసిన ఈడీ. హీరా గ్రూప్ చైర్మన్ నౌహీరా షేక్‌ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది. నాంపల్లి కోర్టులో ట్రాన్సిట్ వారంట్‌ను ఈడీ దాఖలు చేసింది. కాగా, ప్రస్తుతం హీరా గ్రూప్ చైర్మన్ నౌహీరా షేక్‌ చంచల్‌గూడ జైల్లో ఉన్నారు. విదేశీ నిధుల పెట్టుబడులు, సేవలపై ఆరా తీయాలని ఈడీ భావిస్తోంది. అధిక వడ్డీ ఆశ చూపించి అమాయకులను మోసం చేసినట్టు నౌహిరా గతంలోనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. మైనార్టీలకు అండగా నిలుస్తామంటూ ఆ ముసుగులో అక్రమాలకు పాల్పడ్డట్టు బాధితులు గతంలో ఆఫీసుల ముందు ధర్నాలు చేశారు. ఫైనాన్స్, గోల్డ్ స్కీమ్‌లలో తామంతా మోసపోయినట్టు వందల మంది నిరసనలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com