రమదాన్: 500కి పైగా కన్స్యుమర్ గూడ్స్ ధరల తగ్గింపు
- April 26, 2019
దోహా: మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ అండ్ ఇండస్ట్రీ, 500కి పైగా కమోడిటీస్ ధరల్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. పవిత్ర రమదాన్ నేపథ్యంలో ఈ ధరల తగ్గింపుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రముఖ సూపర్ మార్కెట్స్‌తో కలిసి తీసుకున్న ఈ నిర్ణయం నేపథ్యంలో ధరలు నేటి నుంచి తగ్గుతాయి. ఈ తగ్గుదల రమదాన్ పూర్తయ్యేవరకు అమల్లో వుంటుంది. తగ్గిన ధరల ప్రకారం బలాద్నా మిల్క్ 1 లీటర్ 5 ఖతారీ రియాల్స్‌కి దొరుకుతుంది. 800 గ్రాముల అల్ వహా ఫ్రశ్రీష్ చికెన్ 13.25 ఖతారీ రియాల్స్. ఫ్రోజెన్ హోల్ చికెన్ 1 కిలో 11 ఖతారీ రియాల్స్. పంజాబీ గార్డెన్ బాస్మతీ రైస్ 29 ఖతారీ రియాల్స్‌కి ఐదు కేజీలు లభ్యమవుతాయి. రమదాన్ సందర్భంగా కమోడిటీస్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సప్లయర్స్‌తో కమ్యూనికేట్ చేసినట్లు మినిస్ట్రీ వివరించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







