కొత్త సంవత్సరంకు వాట్సప్ పెద్ద షాకిచ్చింది..
- January 01, 2016
కొత్త సంవత్సరం వచ్చేసింది.. స్నేహితులు, బంధువులు అందరికీ శుభాకాంక్షలు చెబుదామని అనుకున్న వాళ్లకు వాట్సప్ పెద్ద షాకిచ్చింది. ప్రస్తుతం ఫేస్బుక్ యాజమాన్యం చేతుల్లో ఉన్న ఈ సోషల్ మీడియా నుంచి సందేశాలు పంపడానికి, అందుకోడానికి కూడా చాలాచోట్ల సమస్యలు ఎదురయ్యాయి. ప్రధానంగా యూకే, పశ్చిమ యూరప్ దేశాల్లో వాట్సప్ బాగా ఇబ్బంది పెట్టినట్లు డౌన్‌డిటెక్టర్ అనే సైట్ తెలిపింది. ఇంటర్నెట్, మొబైల్ సేవల రియల్ టైం సేవలు ఎలా ఉన్నాయన్న విషయాన్ని ఈ సైట్ చెబుతుంది.భారతదేశంలో కూడా కొన్ని ప్రాంతాల్లో రాత్రి కొంత సమయం పాటు మెసేజిలు పంపడానికి, అందుకోడానికి కూడా సమస్యగానే ఉందని కొందరు వినియోగదారులు తెలిపారు.ప్రధానంగా రాత్రి 12 గంటలకు ముందు అంతా బాగానే ఉన్నా, తర్వాత మాత్రం కాసేపు మెసేజిలు వెళ్లలేదు. ఈ సమస్యను పూర్తిగా పరిష్కరించేందుకు తాము ప్రయత్నిస్తున్నట్లు వాట్సప్ తెలిపింది. అయితే దానికి కారణం ఏంటి, ఎప్పుడు మొదలైందన్న విషయాలకు మాత్రం సమాధానం లేదు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 90 కోట్ల మంది వాట్సప్ వాడుతున్నారని ఫేస్బుక్ చెబుతోంది.
తాజా వార్తలు
- విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్..
- 4 ఉమ్రా కంపెనీలను సస్పెండ్ చేసిన హజ్ మంత్రిత్వ శాఖ..!!
- మంచినీటిని వృధా చేసినందుకు రెస్టారెంట్‌కు నోటీసులు జారీ..!!
- ఈ వారాంతంలోనూ 3 యూఏఈ ఆకర్షణలు మూసివతే..!!
- చిక్కుకుపోయిన ప్రయాణికులకు కీలకమైన రవాణా కేంద్రంగా ఒమన్..!!
- C-SIPA ఫ్రేమ్‌వర్క్..బహ్రెయిన్, యూస్, యూకే సమీక్ష..!!
- యూఏఈ లాటరీ..లక్కీ డే డ్రాలో 8,000 మందికి పైగా విజేతలు..!!
- ఖతార్‌లోని ప్రైవేట్ స్కూళ్లలో 70% హాజరు..!!
- కువైట్ సోషల్ సెక్యూరిటీ కార్యాలయం పై దాడి: భవనం పాక్షికంగా ధ్వంసం
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్









