బంగారం తళుకులు తగ్గాయి
- January 01, 2016
ఏడాది చివరి రోజు దేశీయ మార్కెట్లో బంగారం తళుకులు తగ్గాయి. 10 గ్రాముల పసిడి ధర 25,000 రూపాయల దిగువకు జారింది. స్టాకిస్టులు, రిటైల్ కొనుగోలుదారుల నుంచి ఆశించిన స్థాయిలో గిరాకీ లేకపోవడంతో వరుసగా మూడో ఏడాదిలోనూ పసిడి ధర క్షీణతనే చవిచూసింది. ఏడాదిలో పసిడి ధర 1,740 రూపాయలు (6.51 శాతం) మేర తగ్గిపోయింది. ఇక వరుసగా ఐదో రోజూ వెండి ధర క్షీణించింది. ముంబై మార్కెట్లో 99.5 శాతం స్వచ్ఛత కలిగిన పసిడి ధర గురువారం 175 రూపాయలు తగ్గి 24,980 రూపాయలకు చేరుకుంది. 99.9 శాతం స్వచ్ఛత బంగారం ధర కూడా ఇదే స్థాయిలో తగ్గి 25,130 రూపాయలకు చేరింది. కిలో వెండి ధర 95 రూపాయల నష్టంతో 33,565 రూపాయలకు క్షీణించింది. 2014తో పోల్చితే 2015 సంవత్సరంలో 10 గ్రాముల స్టాండర్డ్ బంగారం ధర 6.51 శాతం, ప్యూర్ బంగారం ధర 6.48 శాతం, వెండి ధర 9.78 శాతం క్షీణించింది.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







