హైదరాబాద్‌కు కీలక మ్యాచ్..
- April 27, 2019
ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇవాళ కీలక మ్యాచ్ ఆడనుంది. ప్లే ఆఫ్ అవకాశాలు చేజారకుండా ఉండాలంటే ఇవాళ రాజస్థాన్ రాయల్స్‌పై గెలిచి తీరాలి. ఇప్పటికే ఓపెనర్ బెయిర్ స్టో స్వదేశానికి వెళ్ళిపోగా… వచ్చే వారం వార్నర్ సేవలు కూడా కోల్పోనుంది. దీంతో ప్రతీ మ్యాచ్ హైదరాబాద్‌కు కీలకంగా మారాయి.
ఐపీఎల్ పన్నెండో సీజన్ లీగ్ స్టేజ్ చివరి దశకు చేరుకుంది. ఇకపై ప్రతీ జట్టుకీ ప్రతీ మ్యాచ్ కీలకమే.. ఓడితే ప్లే ఆఫ్‌పై ఆశలు వదులుకోవాల్సిందే. ఇవాళ సన్‌రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్‌తో తలపడబోతోంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదు విజయాలతో ఐదో స్థానంలో ఉన్న సన్‌రైజర్స్ మిగిలిన మ్యాచ్‌లలో కనీసం మూడు గెలవాల్సి ఉంటుంది. దీనికి తోడు ఓపెనర్ జానీ బెయిర్‌స్టో ప్రపంచకప్ కోసం స్వదేశానికి వెళ్ళిపోవడం, వచ్చే వారం డేవిడ్ వార్నర్ కూడా జట్టును వీడనున్న నేపథ్యంలో ముందుగానే ప్లే ఆఫ్ అవకాశాలు మెరుగుపరుచుకోవాలని సన్‌రైజర్స్ భావిస్తోంది. ఈ సీజన్‌లో హైదరాబాద్ ప్రదర్శన పడుతూ లేస్తూ సాగుతోంది. సొంతగడ్డపై వరుస విజయాలు సాధించిన హైదరాబాద్ బయట జరిగిన మ్యాచ్‌లలో మాత్రం నిరాశపరిచింది. దీనికి తోడు ఓపెనర్లపైనే ఎక్కువగా ఆధారపడుతుండడం కూడా ఈ ఓటములకు కారణంగా చెప్పొచ్చు. రెండు, మూడు మ్యాచ్‌లలో మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్‌కు అవకాశం వచ్చినా విఫలమయ్యారు. ప్రస్తుతం బెయిర్‌స్టో లేకపోవడంతో వార్నర్ ఫామ్ కీలకంగా మారనుంది. బౌలింగ్‌లోనూ నిలకడ లేకపోవడం సన్‌రైజర్స్‌కు ఇబ్బందిగా మారింది. చెన్నైసూపర్‌కింగ్స్‌పై హైదరాబాద్ బౌలర్లు సమిష్టిగా విఫలమయ్యారు.
ఇప్పటి వరకూ ఎలా ఆడినా… ఇకపై ఆడనున్న మ్యాచ్‌లు హైదరాబాద్ ప్లే ఆఫ్ బెర్తును డిసైడ్ చేయనున్నాయి. వార్నర్ లేకుండా చివరి రెండు లీగ్ మ్యాచ్‌లు ఆడాల్సిన పరిస్థితి ఉండడంతో రాజస్థాన్‌తో పాటు పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌లలో గెలిస్తే ప్లే ఆఫ్‌కు చేరినట్టే. ఒకవేళ ఓడిపోతే మాత్రం చివరి లీగ్ మ్యాచ్ వరకూ ప్లే ఆఫ్ బెర్త్‌పై సందిగ్థత కొనసాగుతూనే ఉంటుంది. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ గాడిన పడడం, బౌలర్లు పుంజుకుంటే రాజస్థాన్‌పై గెలుపు పెద్ద కష్టం కాదు. మరోవైపు గత మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఓడించిన రాజస్థాన్‌కు కూడా ప్లే ఆఫ్ అవకాశాలు నిలిచే ఉన్నాయి. ఆ జట్టులో కూడా కొందరు కీలక ఆటగాళ్ళు ప్రపంచకప్ ప్రిపరేషన్ కోసం వెళ్ళిపోవడం ఎదురుదెబ్బగా చెప్పొచ్చు. అయితే హోంగ్రౌండ్‌లో మెరుగైన రికార్డు ఉన్న నేపథ్యంలో రాజస్థాన్‌ను కూడా తక్కువ అంచనా వేయలేం. ఇరు జట్ల ప్లే ఆఫ్ అవకాశాలు ఈ మ్యాచ్‌పై ఆధారపడి ఉండడంతో హోరాహోరీ పోరు ఖాయమని చెప్పొచ్చు.
తాజా వార్తలు
- ఫిలిఫ్పీన్స్‌లో భారీ భూకంపం..సునామీ హెచ్చరికలు జారీ..
- దుబాయ్ లో ఘనంగా యూఏఈ 52వ నేషనల్ డే వేడుకలు
- యూఏఈ జాతీయ దినోత్సవ వేడుకల కోసం ట్రాఫిక్ రూల్స్ జారీ
- హైదరాబాద్ నుండి గోండియాకు విమాన సర్వీసులు ప్రారంభం
- ప్రభుత్వ సెలవు దినాల్లో మూడు ఎమిరేట్స్‌లో ఉచిత పార్కింగ్
- AFC ఆసియా కప్ ఖతార్ 2023 మస్కట్ల ఆవిష్కరణ
- యువరాజు మమదూహ్ బిన్ అబ్దుల్ అజీజ్ అంత్యక్రియల ప్రార్థనలో పాల్గొన్న క్రౌన్ ప్రిన్స్
- అవినీతి నిరోధక శాఖ అదుపులో 146 మంది
- ఒమన్, స్విట్జర్లాండ్ మధ్య కీలక ఒప్పందాలు
- నాలుగు రాష్ట్రాల్లో రేపే అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్..